Tuesday, July 14, 2026

జాతీయం

గ్యాస్ సిలిండర్ డెలివరీలో కొత్త రూల్.. ఇకపై ఓటిపి లేకుంటే సిలిండర్‌ ఇవ్వరు.

వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచదేశాలతోపాటు భారత్ లోనూ చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో LPG గ్యాస్ సిలిండర్ డెలివరీ వ్యవస్థను మరింత సురక్షితం చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది.
ఏప్రిల్ 21, 2026న సవరించిన ఈ కొత్త పద్ధతి వినియోగదారులకు ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీని మరింత సురక్షితంగా, పారదర్శకంగా, నమ్మదగినదిగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నూతన విధానం ప్రకారం, ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌కు వచ్చే 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' (డీఏసీ)ను డెలివరీ వ్యక్తికి తప్పనిసరిగా చూపించాలి. ఈ కోడ్ లేకుండా గ్యాస్ సిలిండర్‌ను అందజేయరు. డీఏసీ వ్యవస్థ 'వన్-టైమ్ పాస్‌వర్డ్' (OTP) వంటిదే. సిలిండర్ బుక్ చేసిన తర్వాత, వినియోగదారులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ప్రత్యేకమైన కోడ్ వస్తుంది. ఇంటి వద్ద సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు ఈ కోడ్‌ను డెలివరీ వ్యక్తికి చూపించాల్సి ఉంటుంది. సరైన కోడ్ చూపించకపోతే, డెలివరీ రద్దు అయి, సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఉంది.

డీఏసీ అంటే 'డెలివరీ అథెంటికేషన్ కోడ్'. ఇది వినియోగదారులు ప్రతిసారి ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసినప్పుడు జనరేట్ అయ్యే ఒక ప్రత్యేకమైన వెరిఫికేషన్ కోడ్. ఈ వ్యవస్థ ద్వారా సిలిండర్ సరైన వినియోగదారుడికి మాత్రమే చేరేలా నిర్ధారిస్తుంది, నకిలీ డెలివరీలు, తప్పుడు బిల్లింగ్, మరియు గ్యాస్ దొంగతనాలను నివారిస్తుంది. డెలివరీ వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు, వారు డీఏసీ కోడ్‌ను అడుగుతారు. కస్టమర్ తమ మొబైల్‌కు వచ్చిన కోడ్‌ను చూపించాలి. కోడ్ విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాత, డెలివరీ పూర్తవుతుంది. ఒకవేళ కోడ్ అందించకపోతే లేదా సరిపోలకపోతే, డెలివరీ ప్రక్రియ ఆగిపోతుంది.

వ్యాఖ్యలు

ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి.

మీ వ్యాఖ్య