తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ఆవేదన కారణం కాంగ్రెస్ పార్టీ అహకరపు వైఖరి - బీజేపీ అధికార ప్రతినిధి NV సుభాష్
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ఆవేదన ఈ స్థాయికి చేరుకోవడం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వపు నిర్లక్ష్యం, నిర్బంధం, అహంకార పాలనకు నిదర్శనం.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని చికిత్స పొందుతూ మరణించడం అత్యంత విషాదకరం..ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ఆవేదన ఈ స్థాయికి చేరుకోవడం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వపు నిర్లక్ష్యం, నిర్బంధం, అహంకార పాలనకు నిదర్శనం.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని చికిత్స పొందుతూ మరణించడం అత్యంత విషాదకరం ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే.
గత రెండు సంవత్సరాలుగా కార్మికులు తమ సమస్యలు చెబుతూ వస్తుంటే పట్టించుకోకుండా, వారిని బెదిరింపులకు గురిచేసి, సమ్మెను అణగదొక్కే ప్రయత్నాలు చేసి ఈ దుస్థితికి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంటే సమస్యలు పరిష్కరించాల్సింది పోయి, తక్షణ నియామకాల పేరుతో కొత్త డ్రైవర్లు, కండక్టర్లకు నోటిఫికేషన్లు విడుదల చేసి కార్మికుల మనోభావాలను రెచ్చగొట్టింది.
ఒకవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. సమ్మె విరమింపజేయాల్సింది పోయి మరింత ఉద్రిక్తత పెంచేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ వైఫల్యం, పూర్తి నిర్లక్ష్యం.
ఇప్పటికే ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడగా, శంకర్ గౌడ్ గారి మరణం రాష్ట్రాన్ని కలచివేసింది. ఇంకెంతమందిని బలి తీసుకోవాలనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం?
కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, సమ్మెను అణచివేయాలనే కుట్ర మొదటి నుంచి కొనసాగుతోంది. కమిటీలు, గడువుల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికులను మానసికంగా వేధించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.
ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి..ఇప్పుడు మాట తప్పి పూర్తిగా వెనక్కి తగ్గడం ఎందుకు?
ఆనాడు తెలంగాణకు అన్యాయం జరుగుతోందని నాడు మాట్లాడి సోనియా గాంధీని బలిదేవత అని విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు స్వయంగా తెలంగాణ కార్మికులను బలి తీసుకుంటున్న బలిదేవుడిగా మారిపోయాడు.
మరోవైపు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది. విద్యార్థులకు రూ.8 వేల కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా వారిని రోడ్డెక్కే పరిస్థితికి నెట్టింది.
ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన సెక్రటేరియట్ ఉద్యోగులే నిరసనకు దిగే పరిస్థితి ఏర్పడింది. ఇది పరిపాలనలో పూర్తిస్థాయి వైఫల్యం.
ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతుంటే, మూడో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట కార్మికులు నిరసనలు తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసహనం స్పష్టంగా చూపిస్తోంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, 32 డిమాండ్లు నెరవేర్చాలి అని కార్మికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.అటు బీఆర్ఎస్ కూడా మాట్లాడే నైతిక హక్కు లేని పార్టీ. గతంలో వారి పాలనలోనే సుమారు 40 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు బలిదానమయ్యారు.
2019లో 52 రోజులు సమ్మె జరిగినా చర్చలకు పిలవని నిర్దయ పాలన అది. జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడినా పట్టించుకోలేదు. సమ్మెలో పాల్గొన్న వారిని విధుల్లోకి అనుమతించలేదు. కార్మిక సంఘాలను రద్దు చేసిన చరిత్ర కేసీఆర్ ది.
లాఠీచార్జీలు, అరెస్టులు, జైలుకు పంపడం, అంత్యక్రియల సమయంలో శవాలను కూడా లాక్కెళ్లడం—ఇది బీఆర్ఎస్ పాలనలో జరిగిన దారుణం.
గతంలో కేసీఆర్ పాలనలో జరిగిన తీవ్ర అన్యాయాన్ని నిరసిస్తూ, ఆర్టీసీ కార్మికుల తరఫున బిజెపి ఆధ్వర్యంలో ఉక్కు పడికిలి బిగించి పోరుబాట పడితే.. అనేక మంది బిజెపి నాయకులను, కార్యకర్తలను కేసీఆర్ సర్కారు అరెస్టు చేసి జైలుకు పంపింది. అనేకమందిపై లాఠీచార్జ్ లతో, నిర్భంధాలతో పీడించింది.
PF బకాయిలు చెల్లించకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నమ్మించి మోసం చేసింది. అలాంటి పార్టీ ఇప్పుడు మద్దతు అంటూ నటించడం సిగ్గుచేటు.
కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్..ఇరు పార్టీలూ ఆర్టీసీ కార్మికులకు ద్రోహం చేసినవే. ఈ క్లిష్ట సమయంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే కార్మికుల పక్షాన నిలబడి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలో సమ్మెలో పాల్గొంటూ సంఘీభావం తెలుపుతోంది.
కార్మికుల హక్కుల కోసం ఎన్. రాంచందర్ రావు గారి నాయకత్వంలో బీజేపీ శ్రేణులు నిరంతరం పోరాడుతున్నాయి, పోరాడుతూనే ఉంటాయి. అయితే కార్మికులు ఎవరూ కూడా అధైర్యపడి ఆత్మహత్యల వంటి నిర్ణయాలు తీసుకోకూడదు..ప్రాణం తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదు, మీ కుటుంబాలను బలి చేయొద్దు. మీ కోసం బీజేపీ ఉంది, మీ పోరాటం మా పోరాటమే.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి, కార్మికుల న్యాయమైన ప్రధాన డిమాండ్లు వెంటనే అమలు చేయాలి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి, ఉచిత బస్సు పథకం కింద నెలకు రూ.400 కోట్ల బకాయిలు విడుదల చేయాలి, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, బ్రెడ్‌విన్నర్ పోస్టులను పర్మినెంట్ చేయాలి, అద్దె బస్సు డ్రైవర్లను సంస్థలో విలీనం చేయాలి, ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలి.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేత రాజకీయాలు మానుకుని కార్మికులతో చర్చలు జరిపి అన్ని డిమాండ్లు నెరవేర్చాలి. లేదంటే ఆర్టీసీ కార్మికుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుంది..ఇది హెచ్చరిక మాత్రమే కాదు, సంకల్పం.
NV సుభాష్
బీజేపీ అధికార ప్రతినిధి
తెలంగాణ

వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి.
మీ వ్యాఖ్య